యూనిట్
Flash News
స్వతస్సిద్ధ అధికారము

స్వతస్సిద్ధ అధికారము
పశ్న : నిందితుడు
నేరమును కోర్టుయందు ఒప్పుకొనినప్పుడు శిక్ష వేసిన పిదప అట్టి కేసుల యందు సదరు
నిందితుడు అప్పీలు చేయుటకు అవకాశము ఉన్నదా?
జవాబు : మామూలుగా
సెక్షన్ 374 ప్రకారం శిక్షపడిన వ్యక్తిపై కోర్టు
యందు అప్పీలు చేయుటకు అధికారం కలదు. కానీ నేరస్థుడు తానే నేరమును ఒప్పుకొనినపుడు
తానే సదరు శిక్షపై పై కోర్టు యందు అప్పీలు చేసుకొనుటకు అవకాశము లేదు అని సెక్షన్ 375 జతీ.ూ.జ.లో చెప్పబడినది. కానీ ఇట్టి
వాటిలో నిందితుడు ఈ క్రింది సందర్భాలలో మాత్రమే అప్పీల్ చేసుకోవచ్చును.
1) శిక్ష యొక్క కాల విస్తృతిపైన అంటే జడ్జి
లేదా మేజిస్ట్రేట్ ఎక్కువ కాలమునకు కారాగాక వాసము లేదా జుర్మానా వేసినచో, అది సమంజసముగా లేదు అని పై కోర్టు యందు
అప్పీల్ చేసుకోవచ్చును.
2) ఒకవేళ ఆవిధంగా వేసిన శిక్ష శాసన బద్ధతగా
లేదు అని అనుకున్నప్పుడు కూడా శిక్షపై నిందితుడు పై కోర్టు యందు అప్పీల్
చేసుకోవచ్చును.
ప్రశ్న : ఏదైనా
కేసుల యందు కోర్టువారు నేరస్థుడికి శిక్ష వేసిన పిదప, సదరు శిక్ష సరిపోదు అని ప్రాసిక్యూషన్
వారు అట్టి శిక్షపై అప్పీల్ చేసుకొనుటకు అవకాశం కలదా?
జవాబు : సెక్షన్
377 యందు దీనికి సంబంధించి వివరించటము
జరిగింది. ఒకవేళ విచారణ చేసే కోర్టు వేసిన శిక్ష చాలా తక్కువగా ఉన్నది లేదా అది
సరిపోయినంత లేదు అని అనుకొనినపుడు స్టేట్ గవర్నమెంట్ వారు అట్టి కేసును
మేజిస్ట్రేట్ కోర్టువారు వేసిన శిక్షపై సెషన్స్ కోర్టు నందు అప్పీల్
చేసుకోవలెను. ఒకవేళ ఏదైనా కేసు యందు సెషన్స్ కోర్టువారు విచారణ జరిపించి
నేరస్థునిపై శిక్ష వేసినపుడు అప్పీల్‌ను హైకోర్టు యందు అప్పీల్ చేయవలెను. ఇక్కడ
సెషన్స్ కోర్టు అనగా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు, అడిషనల్
సెషన్స్ కోర్టు లేదా ఏదైనా మేజిస్ట్రేట్ కానటువంటి కోర్టు.
పైవిధంగా అప్పీల్ వేసిన కేసుల యందు
క్రింది కోర్టువారు విధించిన శిక్ష సరిపోదు అనే కారణంతో ఉండినపుడు, అప్పీల్ వేయబడిన కోర్టు సదరు
నిందితుడికి నోటీసు జారీచేసి అతనికి తగినంత అవకాశము ఇచ్చి ఇరుపార్టీల వాదన
విన్నతరువాత ఎక్కువ శిక్షను వేయుటకై ఒక నిర్ణయము నకు వస్తుంది. కానీ సదరు
నిందితుడు తన వాదనయందు శిక్ష కొట్టివేయమని కానీ లేదా వేసిన శిక్షను ఇంకా
తగ్గించమని కూడా కోరవచ్చును.
ప్రశ్న : ఎలాంటి కేసులలో అప్పీల్
చేయుటకు అవకాశము ఉండదు.
జవాబు : చిన్న
(ూవ్‌్‌వ) కేసులలో ఈ క్రింద చూపబడిన కాలపరిమితికి శిక్ష పడినతరువాత, ఆ శిక్షపై పై కోర్టుకు నిందితుడు
అప్పీల్ చేసుకొనుటకు అవకాశము ఉండదు అని సెక్షన్ 376లో
తెలియజేయబడినది. ఈ నిబంధన గురించి సెక్షన్ 374కు
సంబంధము లేకుండా తెలియజేయబడినది.
ఎ) హైకోర్టు ఆరు నెలలకు మించకుండా
మరియు/లేక జరిమానా వెయ్యి రూపాయల వరకు శిక్ష వేసినపుడు అట్టిదానిపై అప్పీలు ఉండదు.
బి) సెషన్స్ కోర్టు లేక మెట్రోపాలిటన్
మేజస్ట్రేట్ మూడు మానములకు మించని కాలపరిధి కారాగారవాసమునకు లేక రెండు వందల
రూపాయలకు మించని జుర్మానాకు లేక రెండింటికి శిక్ష వేసినచో, అట్టివాటిపై అప్పీలు ఉండదు.
సి) మొదటి తరగతి మేజిస్ట్రేట్ వంద
రూపాయలకు మించని జుర్మానా మాత్రమే శిక్షించిన యెడల లేక
డి) సమ్మరీ ట్రయల్ జరిపిన మేజిస్ట్రేట్
లేదా సెక్షన్ 260 జతీ.ూ.జ కింద అధికారం పొందిన
మేజిస్ట్రేట్ రెండు వందల రూపాయల జుర్మానాతో శిక్షింపబడిన యెడల అట్టి శిక్షకు
గురియైన వ్యక్తిపై కోర్టులో అప్పీల్ చేసుకొనుటకు అవకాశముండదు.
ఒకవేళ పైవిధముగా వేసిన శిక్షతో పాటు
వేరే అపరాధముతో కలిపి వేసినచో అప్పీల్ చేయుటకు అవకాశము కలదు. కానీ జుర్మానా
కట్టనిచో జైలుశిక్ష ఉండినచో అలాగే జుర్మానాతో పాటు శాంతియుతముగా ఉండవలెనని బాండు
వ్రాసి ఇచ్చిన కాని లేదా ఒకటి కంటే ఎక్కువ అపరాధములు ఉండిన యెడల అన్నింటికీ కలిపి
జుర్మానా రూపాయలు రెండు వందలు మించకుండా ఉండినచో అలాంటి వాటియందు కూడా అప్పీల్
చేయడానికి వీలులేదు.
ప్రశ్న : హైకోర్టు
నుండి సుప్రీంకోర్టులో ఎప్పుడు అప్పీల్ చేయవచ్చును?
జవాబు : హైకోర్టు
వారు అప్పీల్ యందు క్రింద కోర్టువారు కొట్టివేసిన కేసు యందు శిక్షను ఖరారు
చేసినచో, ఆ శిక్ష మరణ శిక్ష, జీవిత కారాగార వాసము లేదా పది
సంవత్సరముల వరకు లేదా అంతకంటే శిక్ష ఎక్కువ వేసినపుడు సెక్షన్ 379 ప్రకారం సుప్రీంకోర్టు యందు అప్పీల్
చేయవలెను.
ప్రశ్న : శిక్షపడిన
వ్యక్తి జైలు యందు ఉండినపుడు అప్పీల్ ఏవిధంగా చేయవలెను?
జవాబు : సెక్షన్
383 యందు ఈ
విషయము గురించి చెప్పబడినది. శిక్షపడిన వ్యక్తి జైలులో ఉన్నప్పుడు జైలు ఇన్‌ఛార్జిగా
ఉన్న అధికారికి తాను చేయు అప్పీల్ ఆధారములను మరియు అందువెంబడి తీర్పు కాపీ జతపరచి
ఇవ్వవలెను. సదరు జైలుఅధికారి సరియైన అప్పీలేటు కోర్టు వారికి పంపుదురు.
ప్రశ్న : అప్పీల్
పెండింగ్‌లో ఉన్నప్పుడు జైలు యందు శిక్షకు గురియైన వ్యక్తి ఉండినచో బెయిల్‌పై
విడుదల చేయవచ్చునా?
జవాబు : అప్పీలేటు
కోర్టు యందు అప్పీల్ పెండింగ్‌లో ఉన్నప్పుడు శిక్షకు గురియైన వ్యక్తి జైలులో
ఉండినచో అతనిని అప్పీలేటు కోర్టువారు బెయిల్‌పై అనగా, జామీనుపై గాని, స్వంత బాండుపై గాని విడుదల చేయవచ్చును.
అప్పీలేటు కోర్టువారు క్రింది కోర్టువారి దండనకు గురియైన వ్యక్తిని తగిన కారణములు
ఉండినచో దండన ఉత్తర్వును నిలుపుదల గాని లేక దాని అమలును నిలిపివేయవచ్చును. ఈవిధముగా బెయిల్ మంజూరు చేయునపుడు
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నోటీసు ఇవ్వవలెను. అతని వాదనలను కూడా పరిగణనలోకి
తీసుకోవలెను. ఈవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసు ఎప్పుడు ఇవ్వవలెను అనగా సదరు
శిక్షకు గురియైన వ్యక్తికి వేసిన దండన మరణ శిక్ష గానీ, జీవిత ఖైదు గానీ లేదా 10 సం||లకు
తక్కువ గాని కారాగార వాసమును విధించి వుండవలెను. ఒకవేళ బెయిల్ మంజూరు చేసినా కూడా
దానిని రద్దుపరచుటకు కూడా దరఖాస్తు వేయవచ్చును. ఈవిధంగా అప్పీలేట్ కోర్టుకు గల
అధికారములు రాష్ట్ర హైకోర్టుకు కూడా ఉంటాయి. ఒకవేళ అప్పీలేటు కోర్టు క్రిందిస్థాయి
కోర్టు అయిన యెడల.
ప్రశ్న : శిక్షవేసిన
కోర్టు వారు కూడా ఏ సదర్భములలో బెయిల్ ఇవ్వవచ్చును?
జవాబు : శిక్ష
వేసిన కోర్టువారు కూడా ఈ క్రింద తెల్పబడిన సందర్భములలో నేర స్థాపితము గాబడిన వ్యక్తి ఒకవేళ
దండన తీర్పుపై అప్పీల్ చేసుకుంటా అని అనినచో బెయిల్ మంజూరు చేయవచ్చును.
1) నిందితుడు బెయిల్‌పై ఉండి అతనిపై
కోర్టువారు మూడు సంవత్సరముల వరకు కారాగారము వేసినచో లేదా
2) శిక్షకు గురియైన వ్యక్తిపై మోపబడిన
అపరాధము బెయిలబుల్ నేరము అయి
ఉండి, అతను
బెయిల్‌పై ఉండినచో.
పై సందర్భాముల యందు బెయిల్ ఇవ్వటానికి
నిరాకరించినయెడల అందులకు సంబంధించిన ప్రత్యేక కారణములను వ్రాయవలెను.
ఒకవేళ సదరు నేర స్థాపితమైన వ్యక్తికి
బెయిల్‌పై రిలీజ్ చేసినయెడల,
అతనిపై వేసిన దండనను కూడా నిలుపుదల చేసినట్లుగా
భావింపవలెను.
తరువాత అప్పీల్ యందు కూడా శిక్ష ఖరారు అయినచో బెయిల్‌పై విడుదల అయిన కాలమును శిక్ష కాలమును లెక్కించటములో తీసివేయవలెను. అనగా బెయిల్‌పై విడుదల అయిన కాలమును శిక్షాకాలముగా పరిగణించ కూడదు.