యూనిట్
Flash News
చట్టాన్ని తెలుసుకుందాం

Sec.482
Inherent Power (స్వతస్సిద్ధ
అధికారము)
హైకోర్టు వారికి ఈ
కోడ్‌లోని నిబంధనములతో నిమిత్తం లేకుండా స్వతస్సిద్ధంగా ఏదైన సత్ఫలితములను
పొందుటకుగాను లేక ఈ కోడ్‌ను అనుసరించి ఇచ్చిన ఉత్తర్వును సమర్ధవంతంగా అమలు
చేయుటకుగాను లేక ఏదైన కోర్టు వ్యవహారమును దుర్వినియోగము కాకుండా లేక
లక్ష్యసిద్ధికై అవసరము అయిన ఉత్తర్వులను ఇచ్చే అధికారము కలదు.
శిక్షపడినటువంటి
యందు అప్పీళ్ళు చేయుటకు సంబంధించిన అధికారములు: Sec.374 Crpc
1) హైకోర్టువారు తన
యొక్క అసాధార అధికారమును ఉపయోగించుకొని స్వతగా తానే ఏదైన కేసు యందు విచారణ
జరిపించి నేరస్థుడికి శిక్షను వేసినప్పుడు అట్టి శిక్షపై సుప్రీంకోర్టు యందు
అప్పీళు చేయవలెను.
2) ఏదైన క్రిమినల్
కేసు యొక్క విచారణను సెషన్స్ కోర్టు లేదా అడిషనల్ సెషన్స్ కోర్టువారు చెప్పేటి
ఏడు సంవత్సరములకు పైన నిందితులకి శిక్ష వేసినచో అట్టి కేసుపైన అప్పీళ్ళు హైకోర్టు
నందు వేయవలెను.
3) మెట్రో పాలిటన్
లేక అసిస్టెంట్ సెషన్స్ జడ్జి లేదా మొదటి తరగతి లేక రెండవ తరగతి జూడీషియల్
మెజిస్ట్రేట్ ఏదైన కేసును విచారించి నిందితుడికి శిక్ష వేసిన యెడల సెషన్స్
కోర్టుకు అప్పీళు చేయవలెను.
అంతేకాకుండా
సెక్షన్ 325 ప్రకారం ఎవరికయిన
శిక్ష విధించినప్పుడు లేదా సిఆర్‌పిసి సెక్షన్ వ్యతిరేకముగా సెక్షన్స్ కోర్టుకు
అప్పీళ్ళు చేయవలెను.
నిందితులపై కేసును
కొట్టివేసినప్పుడు ఏయే కోర్టుల యందు అప్పీళ్ళను చేసుకోబడుతుంది.
Sec.378
Crpc యందుపై విషయమును
గురించి వివరంగా తెలియజేయబడినది.
1) పట్టదగ్గ మరియు
నాన్ బెయిలబుల్ అపరాధములను మేజిస్ట్రేట్ పస్ట్‌క్లాస్ కోర్టుయందు విచారణ
జేసినప్పుడు, అట్టి కేసుయందు నిందితులపై కేసు
కోట్టివేసినప్పుడు, జిల్లా సెషన్స్ కోర్టుయందు అప్పీళ్ళు
చేయవలెను.
ఈ విధంగా
అప్పీళ్ళు చేయుటకుగాని జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్)గారు జిల్లా సెషన్స్‌కోర్టు
పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అప్పీళ్ళు చేయమని ఉత్తర్వు ఇస్తాడు. అప్పుడు పబ్లిక్
ప్రాసిక్యూటర్ గారు ఆ కేసును సెషన్స్ కోర్టు యందు అప్పీళ్ళు చేస్తారు.
ఈవిధంగా అప్పీళ్ళు
చేయుటకుగాను మెజిస్ట్రేట్ కోర్టులో పనిచేసే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
జిల్లా ఎస్.పి. గారికి అప్పీల్ ఆధారములను వ్రాసి కేసు ఫైల్‌కు సంబంధించిన
చార్జిషీటు కాపీ, 161 సిఆర్‌పిసి స్టేట్‌మెంట్స్
కాపీ, సాక్షులు కోర్టులో
ఇచ్చిన వాంగ్మూలపు నకళ్ళు మరియు తీర్పుల కాపీలను వాటితో జతచేసి పంపుదురు. అపుపడు
ఎస్.పి. గారు జిల్లా మెజిస్ట్రేట్‌ను కోర్టులో అప్పీల్ వేయవలెను కోరుతాడు.
జిల్లా మెజిస్ట్రేట్ వారు అప్పుడు కొట్టివేసిన కేసును సెషన్స్ కోర్టులో
అప్పీళ్ళు చేయమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఉత్తర్వు ఇస్తాడు.
బి) పై విధమైన
కేసులను మినహాయించి ఇతరాత్రా కేసులతో హైకోర్టు ఆధీనంలో పనిచేసే ఏ కోర్టునందు అయిన
నిందితులపై కేసు కొట్టివేసినప్పుడు హైకోర్టు యందు అప్పీళ్ళు చేయవలెను.
ఆవిధంగా అప్పీళ్
చేయుటకు స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు హైకోర్టు యందు
అప్పీళ్ చేయమని ఆదేశిస్తుంది. పైన చెప్పిన విధంగా సెషన్స్ కోర్టు యందు అప్పీళ్ళు
చేయగా కొట్టివేసినవి. మరియు సెషన్స్ కోర్టు యందు రివిజన్ వేయగా
కొట్టివేసినప్పుడు పైన చెప్పబడిన నిబంధన వర్తించదు. అంటే హైకోర్టు యందు అప్పీళు
చేయబడును.
2) Delhi
Special Police Establishment Act,1946 పరిధిలో చేపట్టిన
కేసులకు సంబంధించి, సెంట్రల్ గవర్నమెంటు ఆధీనంలో ఉండిన వాటికి
సంబంధించిన కేసులయందు పై ప్రకారం అప్పీళ్ళు చేయవలసి ఉంటుంది. అందులకు సంబంధించి
సెంట్రల్ గవర్నమెంటు వారు చర్యలు చేపడుతారు.
3) పై చెప్పబడిన
వాటాయందు హైకోర్టులో అప్పీళు చేయుటకుగాను మొదట హైకోర్టు వారి అనుమతి అవసరము
ఉంటుంది.
4) ప్రైవేటు
కంప్లెయింట్ నందు నిందితులపై కేసు కొట్టివేసినచో అప్పీళు హైకోర్టు నందు మాత్రమే
వేయవలెను.
హైకోర్టు యందు
అప్పీల్ చేయుటకు గాను మొదట హైకోర్టు వారి ప్రత్యేక అనుమతి (స్పెషల్ లీవ్)ని
హైకోర్టు యందు తీసుకోవలెను.
ఈ విధంగా అనుమతిని
తీసుకొనుటకు కాలపరిమితి, కేసును కోట్టివేసినప్పటినుండి రెండు నెలల
వ్యవధి ఉంటుంది.
ఒకవేళ ప్రైవేట్
కంప్లెయింట్ నందు పబ్లిక్ సర్వెంట్ కంప్లెంట్ దారుడు అయినచో కేసును
కొట్టివేసినప్పటి నుండి 6 నెలల కాలవ్యవధిలో
హైకోర్టులో వేసి ప్రత్యేక అనుమతి తీసుకోవలెను.
ఒకవేళ పైన
చెప్పబడినట్లుగా లీవ్ పిటిషన్ మరియు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను హైకోర్టువారు
కొట్టివేస్తే ఆ కేసుల యదు అప్పీళ్ళు చేసుకొనుటకు వీలు ఉండదు.
అప్పీళ్ళు వేయుటకు
కాలపరిమితి:
కాలపరిమితికి
సంబంధించి ది లిమిటేషన్ యాక్ట్, 1963 యందు
తెలియజేయబడినది.
ఎ) సెషన్స్
కోర్టుగాని, హైకోర్టుగాని తమ అధికార పరిధితో కేసు విచారణ
చేపట్టి నిందితుడికి మరణ శిక్ష వేసినచో, మరణ శిక్ష వేసినప్పటి నుండి 30 రోజుల కాలవ్యవధిలో
పైకోర్టుకు అప్పీలు చేసుకోవలెను.
బి) సెషన్స్ కోర్టు
యందు ఏదైన కేసు యందు నిందితుడికి మరణదండన కాక ఏదైన శిక్ష వేసినచో హైకోర్టు యందు 60 రోజులలో అప్పీల్
చేయవలెను.
సి) హైకోర్టుకు
కిందిస్థాయి ఏదైన కోర్టుతో నేరస్థాపనపై అప్పీల్ వేయవలసినప్పుడు 30 రోజుల కాల
వ్యవధిలో అప్పీల్ చేయవలెను. (ఆర్ట్ 115 ఆఫ్ లిమిటేషన్
ఆక్ట్ 1963).
సి) ఏదైన కోర్టులో
కేసును కొట్టివేసినప్పుడు హైకోర్టుకు అప్పీల్ చేయుటకు కాలవ్యవధి 90 రోజులు ఉంటుంది. ఈ
విధంగా అప్పీల్ చేయుటకు స్పెషల్ లీవ్ లేక లీవ్ పిటిషన్ అవసరము లేకుండినచో.
ఒకవేళ స్పెషల్
లీవ్ లేదా లీవ్ పిటిషన్ ద్వారా అనుమతి తీసుకొని అప్పీల్ చేయవలసినప్పుడు
స్పెషల్ లీవ్ లేదా లీవ్ గ్రాంటు చేసిన తేదీ నుండి 30 రోజుల కాలవ్యవధిలో
అప్పీలు చేయవలెను.