యూనిట్
Flash News
ఇంటర్ పోల్ నోటీసులు-గ్లోబల్ ట్రాకింగ్ పద్ధతులు

ఇంటర్ పోల్ నోటీసులను ఐ.సి.పి.ఒ.-ఇంటర్ పోల్-జనరల్
సెక్రటేరెట్‌వారు ప్రచురిస్తారు.నోటీసుల లక్ష్యాలు, ఉపయోగాలు
అనుసరించి వీటిని అయిదురకాలుగా విభజించారు. ప్రతి విభాగానికి ఇంటర్‌పోల్ జనరల్
సెక్రెటేరియేట్‌లో ఒక కార్యాలయం ఉంటుంది.
ఇంటర్ పోల్ నోటీసులు-పేర్లు, విధి
విధానాలు:
(1) రెడ్ కార్నర్ నోటీసు
(ఎ సిరీస్):
రెడ్ కార్నర్ నోటీసు జారీచేసి
చట్టబద్ధమైన అరెస్ట్ వారెంట్ ద్వారా బయటి దేశంలో ఉన్ననేరస్థులను,ఇరుదేశాల
మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందం అనుసరించి,నేరస్థుడిని
అదుపులోకి తీసుకుని, నోటీసు జారీచేసిన దేశానికి
అప్పగిస్తారు. ఈ చర్యలన్నింటిని ఇంటర్‌పోల్ వారు చేపడతారు.
(2) బ్లూ కార్నర్ నోటీసు
(బి సిరీస్):
ఈ నోటీసును నేరచరిత్ర గలిగిన వ్యక్తులు ఏ
దేశములో ఉన్నారో వారి గతచరిత్ర, ప్రవర్తన గురించి ఆరాదీయటానికి జారీ
చేస్తారు. ఈ నోటీసు. కానీ ఈ నోటీసు ద్వారా వ్యక్తి అప్పగింత వీలవదు. నిందితులు,
నేరస్థులే కాకుండా సాక్షులు, అపరాధుల ఆచూకీ
కనుగొనటానికి, వారి పూర్వ ప్రవర్తనా చరిత్రను తెలుసుకోవటానికి
అవకాశం కల్పిస్తుంది.
(3) గ్రీన్ కార్నర్
నోటీసు (సి సిరీస్):
ఈ నోటీసు జారీ ద్వారా నోటీసులోని
వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేసి ఇతర దేశాలలో చేపట్టబోయే ముందస్తు దాడుల యొక్క
సమాచారం సేకరించడానికి ఉపయోగపడుతుంది.
(4) బ్లాక్ కార్నర్
నోటీసు(డి సిరీస్):
ఈ నోటీసు ఎవరైనా గుర్తుతెలియని, చనిపోయినవ్యక్తుల
మృతదేహాల గుర్తింపుకు చేపట్టే చర్యల్లో భాగంగా ఉపయోగపడుతుంది.అలాగే తప్పుడు
గుర్తింపు కలిగి చనిపోయిన వ్యక్తులు, లేదా వారి మృతదేహాలను,వారి వాస్తవ సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడుతుంది.
(5) ఎల్లో కార్నర్ నోటీసు
(ఇ సిరీస్):
తప్పిపోయిన వ్యక్తులను గుర్తించేందుకు
లేదా తప్పిపోయి తమను తాము గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, గుర్తించే
చర్యల్లో భాగంగా ఈ ఎల్లో కార్నర్ నోటీసు ఉపయోగపడుతుంది.
ఆర్.సి.ఎన్. నోటీసు గురించి విపులంగా :
''ఐ.సి.పి.ఒ. ఇంటర్ పోల్
జనరల్ నోటీసు ఆర్.సి.ఎన్.'' అనగా ఒక దేశంలో నేరం
చేసినట్లు నిరూపించబడి శిక్షను తప్పించుకొని ఇతర దేశములో, తలదాచుకునే
వ్యక్తులను చట్టప్రకారం అదుపులోకి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీన్ని
జనరల్ సెక్రెటేరియట్ ఇంటర్‌పోల్ వారు జారీ చేస్తారు. అంతర్జాతీయ పోలీసులకు,
జ్యుడీషియల్ కార్పొరేషన్‌కు క్రిమినల్స్‌ను పట్టుకోవటానికి ఇది ఓ
మంచి ఆయుధం లాంటిది. ఈ ఆర్.సి.ఎన్.(=వస జశీతీఅవతీ చీశ్‌ీఱషవ)ను అధికారికంగా
నాలుగు భాషల్లో జారీ చేస్తారు. ఆంగ్లం-ఫ్రెంచ్-స్పానిష్-అరబిక్. ఈ నోటీసు
ద్వారా జారీ చేయబడిన వారెంటులోని నేరస్థులను, ఏ దేశంలో ఉన్నా
వారి జాడను గుర్తించి తాత్కాలిక నిర్భంధంలోకి తీసుకొని, వారెంటు
జారీచేయబడిన న్యాయస్థానానికి సంబం ధించిన దేశానికి అప్పగిస్తారు.ఈ అప్ప గింత,
ఇరుదేశాల మధ్య నేరస్థుల అప్ప గింతపై ఉన్న పరస్పర ఒప్పందాన్ని అను
సరించి జరుగు తుంది.అంతేగాకుండా దీనిద్వారా నేరం రుజువయి శిక్షను తప్పించుకొని ఇతర
దేశాల్లో తలదాచు కునేవారిని, న్యాయస్థాన పరిధికి లోబడి జరిగే
విచారణ నుండి తప్పించుకు తిరిగే వారిని, పోలీసుల దర్యాప్తు
సమయంలో అందుబాటులో లేకుండా తిరిగే వారిని అదుపులోకి
తీసుకోవచ్చు.
ఆర్.సి.ఎన్. జారీ చేయు విధానం:
ఆర్.సి.ఎన్.ను అమలు పరచడానికిముందు
అనుమతి కోసం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్.సి.బి) లేదా చట్టాన్ని అమలు చేయగలిగే అధికారులచేత అప్లికేషన్
ఫామ్‌ను నింపి ఇంటర్‌పోల్ విభాగానికి పంపాలి.దీన్ని ఇంటర్‌పోల్ వారు పరిశీలించిన
తరువాత ఆర్.సి.ఎన్.అమలుకు అంగీకరిస్తే, ఇంటర్‌పోల్‌లోని
సభ్యత్వం గల దేశాలకు తెలియజేస్తారు.ఆర్.సి.ఎన్. జారీని కోరిన వారికి ఒక
ప్రత్యేకమైన సీక్రెట్ కోడ్ ఇవ్వబడుతుంది.ఈ కోడ్ కేవలం ఆర్.సి.ఎన్.కోరబడిన
సంస్థకు లేదా అధికారికి మాత్రమే ఇవ్వబడుతుంది. దీని కాలపరిమితి ఐదు సంవత్సరాల వరకు
ఉంటుంది. ఒకవేళ నిందితుణ్ణి అదుపులోకి
తీసుకోవడం జరిగినా, లేక కోడ్ కలిగిన సంస్థ కాని అధికారి కానీ
స్వతహాగా రద్దు చేయమని కోరినా ఈ నోటీసుని రద్దు చేస్తారు.