యూనిట్
Flash News
భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

గత సంచికలో మనం వాహనాల
గుర్తింపు కొరకు అనువుగా సీరియల్ నంబర్లు, ఇంజను
ఛాసిస్ నంబర్లు, గుర్తులు
మొదలైనవాటిని వివిధ పద్దతులలో ముద్రించి ఉంటే. ఇటువంటి వాటిని రకరకాలుగా రూపుమాపి
వేరొక గుర్తింపు నంబరును ముద్రించిన కేసులలో అంకెలు మరియు అక్షరాల పునరుద్ధరణకు
ఎచ్చింగ్ కిట్‌ను ఉపయోగించి నిపుణులు ఏవిధంగా పునరుద్ధరణగావిస్తారో గత సంచికలో
మనం చర్చించాం... ఈ సంచికలో వివిధ ఉపరితలాలపై ఉన్న అక్షరాల పునరుద్దరణకు గల సాధ్యా
సాధ్యాలు మరియు ఎటువంటి ద్రావణాలను మరియు
శాస్త్రీయ పద్ధతులను అందుకు ఉపయోగిస్తారో తెలుపుతూ, దర్యాప్తు అధికారి గుర్తుంచుకోవాల్సిన విషయాలను
మరియు కొన్ని కేసులను ఉదాహరణలతో వివరించడమైనది.
ఫోరెన్సిక్ భౌతిక శాస్త్ర
విభాగం
చెరిపి వేయబడిన నంబర్లను
పునరుద్ధరించడం
దొంగిలించబడిన వస్తువులు, వాహనాల నంబర్లను గుర్తించటానికి వీలు లేకుండా
ఫైలింగ్, చిసెలింగ్, గ్రైండింగ్, ఆబ్లిటరింగ్, స్కోరింగ్
పద్ధతుల ద్వారా ఆ నంబరును చెరిపివేసి కొత్త నంబర్లను ముద్రిస్తారు. వీటిని
పునరుద్ధరించడానికి ఫొరెన్సిక్ నిపుణులు రసాయన ఎచ్చింగ్, ఉష్ణోపచారం (హీట్ ట్రీట్‌మెంట్), అయస్కాంత కణ పద్దతి, ఎలక్ట్రో లైటిక్ రెస్టొరేషన్, ఆల్ట్రాసోనిక్ కావిటేషన్ పద్దతి వంటి
శాస్త్రీయ పద్దతులను ఉపయోగిస్తారు.
I. రసాయన ఎచ్చింగ్ పద్ధతి: ఈ పద్ధతిలో
పునరుద్ధరించవలసిన
ఉపరితలాన్ని బట్టి వివిధ
రసాయన ద్రావణాలను
ఉపయోగిస్తారు.
ఉదాహరణకు: 1. జింకు
లోహంతో కూడిన ఉపరితలానికి : పోటాషియం పర్మాంగనేటు (10 గ్రా)
+ ఇథనాల్ (50 మి.లీ) + గాఢ హైడ్రోక్లోరిక్
ఆమ్లం (80 మి.లీ) + నీరు (60 మి.లీ)
2. అల్యూమినియం మిశ్రమ లోహం మరియు ఇత్తడితో కూడిన
ఉపరితలానికి: ఫెర్రిక్ క్లోరైడ్ (6 గ్రా)
+ నీరు లేదా 1 వీ
హైడ్రోక్లోరిక్ ఆమ్లం (94 మి.లీ)
3. పోత ఇనుము మరియు స్టీల్ ఉపరితలాలకు: కాపర్
క్లోరైడ్ (30 గ్రా) + గాఢ హైడ్రోక్లోరిక్
ఆమ్లం (30 మి.లీ) + నీరు (33 మి.లీ)
స్కూటర్, లారీ వంటి వాహనాలపై చెరిపివేసిన సీరియల్
నంబరును పునరుద్ధరించడం:
ద్విచక్రాల వాహనాలు ఒకటి
లేదా రెండు
ఉన్నచో దగ్గరలో ఉన్న
ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపవచ్చును. రెండు కంటే ఎక్కువ వాహనాలున్నా లారీలు, కార్లు లేదా బస్సులు వంటి భారీ వాహనాలను
పరీక్షించవలసి వచ్చినప్పుడు జిల్లా ఎస్పీగారి ద్వారా లేదా సబ్ డివిజినల్ పోలీసు
కార్యాలయ అధికారి ద్వారా కానీ ఫోరెన్సిక్ ప్రయోగశాల డైరెక్టర్‌గారిని నిపుణుల
సేవల కొరకు అభ్యర్థిస్తే వారు ఈ భౌతికశాస్త్ర
విభాగ నిపుణులను అక్కడికే పంపుతారు.
దర్యాప్తు అధికారులు కేసులు
నమోదు చేసిన కొన్ని వాహనాలపై నిపుణులు పునరుద్ధరణ చేసి దర్యాప్తుకు తోడ్పడిన
సాక్ష్యాధారాలను ఫోటోలతో వివరించడం జరిగింది.
II. అయస్కాంత కణ పద్ధతి: ఉదాహరణకు ఈ పద్ధతిలో
తుపాకీపై చెరిపివేసిన సీరియల్ నంబరును పునరుద్ధరించడం:
ఉదాహరణకు తుపాకీమీద ఉన్న
సీరియల్ నంబరును మార్చి వేరే నంబరు ముద్రించబడి ఉన్నదనుకుందాం. దాన్ని ఫోర్సెనిక్
భౌతిక శాస్త్ర విభాగానికి పంపినప్పుడు వారు దానిని పరిశీలించి అసలు నంబరును గీకి
వేసారా? అరగ దీశారా? పంచ్
చేశారా? రసాయనిక ఎచ్చింగ్ చేశారా? డ్రిల్ చేశారా? అని
పరిశీలించి, దాన్ని నోట్‌చేసుకొని, ఫోటోగ్రఫీ పద్ధతిలో రికార్డు చేసుకొని
దానిస్థితిని వర్ణిస్తూ అబ్జర్వేషన్ నోట్స్‌లో రికార్డు చేసుకుంటారు. శాండ్
పేపర్ లేదా నునుపైన పాలీషింగ్ మిషన్‌తో దాని
ఉపరితలాన్ని గీతలు లేకుండా
జాగ్రత్తగా అరగదీస్తారు. దానిపై ప్లాస్టిక్ పిప్పెట్టుతో మాగ్నటిక్ కణాల
ద్రావణాన్ని (మ్యాగ్నాఫ్లక్స్) ఆ ఉపరితలంపై పోసి గుర్రపునాడా అయస్కాంతాన్ని ఆ
ఉపరితలంపై ఉంచుతారు. అప్పుడు
ఉపరితలంపై ఏర్పడి ఉన్న పగుళ్ళ వల్ల ఇనుప రజను అయస్కాంతతత్వంలోని మార్పుల వలన అసలు
నంబరు కనిపిస్తుంది. దాన్ని ఫొటోగ్రాఫ్ చేసుకొని తర్వాత రసాయనిక ఎచ్చింగ్
ద్రావణంతో జాగ్రత్తగా రుద్దుతారు. ఈ విధంగా చేయడంతో అసలు నంబరు
పునరుద్ధరింపబడుతుంది.
II. అయస్కాంత కణ పద్ధతి: ఉదాహరణకు ఈ పద్ధతిలో
తుపాకీపై చెరిపివేసిన సీరియల్ నంబరును పునరుద్ధరించడం:
ఉదాహరణకు తుపాకీమీద ఉన్న
సీరియల్ నంబరును మార్చి వేరే నంబరు ముద్రించబడి ఉన్నదనుకుందాం. దాన్ని ఫోర్సెనిక్
భౌతిక శాస్త్ర విభాగానికి పంపినప్పుడు వారు దానిని పరిశీలించి అసలు నంబరును గీకి
వేసారా? అరగ దీశారా? పంచ్
చేశారా? రసాయనిక ఎచ్చింగ్ చేశారా? డ్రిల్ చేశారా? అని
పరిశీలించి, దాన్ని నోట్‌చేసుకొని, ఫోటోగ్రఫీ పద్ధతిలో రికార్డు చేసుకొని
దానిస్థితిని వర్ణిస్తూ అబ్జర్వేషన్ నోట్స్‌లో రికార్డు చేసుకుంటారు. శాండ్
పేపర్ లేదా నునుపైన పాలీషింగ్ మిషన్‌తో దాని
ఉపరితలాన్ని గీతలు లేకుండా
జాగ్రత్తగా అరగదీస్తారు. దానిపై ప్లాస్టిక్ పిప్పెట్టుతో మాగ్నటిక్ కణాల
ద్రావణాన్ని (మ్యాగ్నాఫ్లక్స్) ఆ ఉపరితలంపై పోసి గుర్రపునాడా అయస్కాంతాన్ని ఆ
ఉపరితలంపై ఉంచుతారు. అప్పుడు
ఉపరితలంపై ఏర్పడి ఉన్న పగుళ్ళ వల్ల ఇనుప రజను అయస్కాంతతత్వంలోని మార్పుల వలన అసలు
నంబరు కనిపిస్తుంది. దాన్ని ఫొటోగ్రాఫ్ చేసుకొని తర్వాత రసాయనిక ఎచ్చింగ్
ద్రావణంతో జాగ్రత్తగా రుద్దుతారు. ఈ విధంగా చేయడంతో అసలు నంబరు
పునరుద్ధరింపబడుతుంది.
ప్లాస్టిక్ పిప్పెట్టుతో
మాగ్నటిక్ కణాల ద్రావణాన్ని (మ్యాగ్నాఫ్లక్స్) ఆ ఉపరితలంపై పోసి గుర్రపునాడా
అయస్కాంతాన్ని ఆ ఉపరితలంపై ఉంచుతారు. అప్పుడు ఉపరితలంపై ఏర్పడి ఉన్న పగుళ్ళ వల్ల
ఇనుప రజను అయస్కాంతతత్వంలోని మార్పుల వలన అసలు నంబరు కనిపిస్తుంది.
III. ఎలక్ట్రోలైటిక్ రెస్టొరేషన్ పద్ధతి:
ఇది కూడా రసాయన ఎచ్చింగ్
ప్రక్రియ వంటిదే కాని చర్య వేగంగా జరగడానికి బ్యాటరీ ఎలక్ట్రిక్ కరెంటును
ఉపయోగిస్తారు. దీనితో కఠినమైన స్టీలు ఉపరితలాలపై చర్యా వేగం పెరుగుతుంది. ఈ
పద్ధతిలో తుపాకీని బ్యాటరీ పాజిటివ్ ఎలక్ట్రోడుకు, ఎచ్చింగ్
స్వాబ్‌ను నెగటివ్ ఎలక్ట్రోడుకు కలిపి పునరుద్ధరణ ప్రక్రియ చేస్తారు.
గుర్తుంచుకోవసిన విషయాలు :
1. ఇనుప
వస్తువులపై అంకెలు, అక్షరాల
పునరుద్దరణకి వాడే ద్రావణం పేరు 'ప్రైస్
రీయేజంట్'
2. తుపాకుల
చెక్క పిడులు, చెక్క ఫర్నిచర్‌పై ఉన్న నంబర్లు కత్తితోగాని, ఉలితో గాని చెక్కితీసివేసినా, కాల్చివేసినా పునరుద్దరణ చేయటం సాధ్యం కాదు.
3. చెక్కమీద
నంబర్లను పంచింగ్ విధానంలో ముద్రించి వుంటే నంబర్లు వేసిన ప్రదేశం లోని క్రింద
ఉన్న చెక్క ఫైబర్లు కొన్ని వంగి మరికొన్ని విరిగి ఉంటాయి. వీటి పునరుద్దరణకు నీటి
ఆవిరిని ప్రసరింప జేస్తారు. దాంతో చెక్కలోని ఫైబర్లు మెత్తబడి, ఉబ్బడం ద్వారా అసలునెంబరు కనిపెట్టవచ్చును.
4. మిశ్రమం
లోహాల కంటే స్వచ్ఛమైన లోహాలపై ఉండే అంకెల పునరుద్దరణ కష్టమైన ప్రక్రియ.
5. ప్లాస్టిక్‌పై
పంచింగ్ పద్ధతిలో వేసిన నంబర్ల పునరుద్దరణ సాధ్యమే.
6. తోలుపై
ఉన్న అక్షరాలను సజల క్షారం ఉపయోగించి పునరుద్దరణ చేయవచ్చును.
7. ఆయుధాలు, తుపాకులు వంటి చిన్న వస్తువులను ఒక చిన్న అట్ట
పెట్టెలో రాపిడికి గురికాకుండా మార్కింగ్ మరియు లేబులింగ్ చేసి జాగ్రత్తగా
ప్యాక్ చేసి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలి.
8. వాహనాలు, తుపాకులు
మరియు ఇతర విలువైన వస్తువుల మీద తుడిచి ముద్రించిన నంబర్లు, గుర్తులను పునరుద్దరించే ప్రక్రియలో నిపుణులు
ఉపరితలాన్ని భౌతిక, రసాయనిక
పద్దతులతో అరగదీసి ఏటవాలు కాంతి క్రింద మరియు అతినీల లోహిత కిరణాల క్రింద
భూతద్దంతో పరీక్షిస్తారు.
9. కొన్ని
ఉపరితలాలపై అసలు నంబరు పునరుద్ధరించ లేనప్పటికీ ఆ నంబరు అసలుదో లేక మార్పులు
చేయబడిందో? అన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుపుతారు.
-- తరువు
సురేష్