యూనిట్
Flash News
కరెన్సీ నోట్లలోని భద్రతా అంశాలు

కరెన్సీ నోట్లలోని భద్రతా అంశాలు
అసలైన -500 మరియు -2000 నోట్లను గుర్తించుటకు చూడవలసిన అంశాలు: ఈ అంశాలను
రిజర్వుబ్యాంకు 8
నవంబర్, 2016న
విడుదల చేసింది. ఈ క్రొత్త -500 నోటు పాతనోటుకంటే
ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నది. ఇది సైజు, రంగు, ముద్రణ, సెక్యూరిటీ అంశాల స్థానాలు, డిజైన్ ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఈ క్రొత్త -500 నోట్లు 150 ఞ 66 మి.మీ. పరిమాణంలో
స్టోన్ గ్రే రంగుతో, ముందు
భాగాన చారిత్రాత్మక ఎర్రకోట గుర్తును, వెనుకవైపు భారత జాతీయ పతాకాన్ని కలిగి ఉంటుంది. అలానే,
-2000 నోటు 166 ఞ 66
మి.మీ. పరిమాణంలో మజంటా రంగుతో, ముందు భాగాన మహాత్మా గాంధీ గుర్తును, వెనుకవైపు అంతరిక్ష
నౌక మంగల్‌యాన్ గుర్తును కలిగి ఉంటుంది.
క్రొత్త -500 నోటు -
ముఖ్యమైన గుర్తింపు చిహ్నాలు:
-500 నోటు ముందు భాగంలో ముఖ్యమైన 12 గుర్తింపు
చిహ్నాలను కలిగి ఉంది.
1 సీత్రూ డినామినేషన్
నంబర్: ముందుభాగంలో సగం, వెనుకభాగంలో
సగం ఉండే విధంగా 500
సంఖ్య ముద్రించబడి ఉంటుంది. రెండు వైపులా ముద్రించబడిన భాగాలు హెచ్చుతగ్గులు
లేకుండా చక్కగా కలిసిపోయి ఉంటాయి. ఇలా ఉండటం వల్ల లైటుకు ఎదురుగా పెట్టి
చూసినప్పుడు రెండు వైపులా ఉన్న 500 అంకె వ్యత్యాసం లేకుండా ఒక్కటిగా కనిపిస్తుంది.
2 కంటికి కనిపించని డినామినేషన్ నంబర్: ఈ భాగంలో -500 అంకె ముద్రించి ఉంటుంది. ఇది మామూలుగా కనిపించదు.
దీనిని 450 కోణంలో లైటుకింద
పెట్టి చూసినప్పుడు ఆ భాగంలోని ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ నల్లబడి మనకు 500 నంబర్
కనిపిస్తుంది.
3 దేవనాగరి లిపిలో ముద్రించిన డినామినేషన్
నంబర్ -500
4 ఎడమవైపుకు తలత్రిప్పినట్లున్న
మహాత్మాగాంధీ చిత్రం: పాత నోటుపై గాంధీ మహాత్ముడు కుడివైపునకు చూస్తున్నట్లు
ఉంటుంది.
5 భద్రతా కవచంలా ఉండే మెరుపు దారం
(సెక్యూరిటీ త్రెడ్): 3 మి.మీ.ల వెడల్పు ఉండే ఒక భద్రతా
పరమైనదారం, దానిపైన
''భారత్'' అని హిందీలో మరియు 'ఆర్‌బిఐ' అని ఇంగ్లీషులో వ్రాయబడి, వివిధ కోణాల్లో దాన్ని చూసినప్పుడు ఆకుపచ్చరంగునుండి, నీలిరంగుకు మారుతూ
కనిపిస్తుంది. ముందువైపునుంచి చూసినప్పుడు దానిపై వ్రాయబడిన అక్షరాలు వివిధ
వర్ణాలు రంగురంగులుగా వెలుగుతున్నట్లుగా కనిపిస్తాయి. లైటుకు ఎదురుగా
వెనుకభాగంనుంచి చూసినప్పుడు ఈ దారంలాంటి గీతపై నుంచి క్రింద వరకు నిలువుగా ఒకే
గీతలాగా కనిపిస్తుంది.
6 చిక్కగా, ఉబ్బెత్తుగా ఉండే ముద్రణ (ఇంటాగ్లియో ప్రింటింగ్):
మహాత్మాగాంధీ బొమ్మ, భారతీయ
రిజర్వుబ్యాంక్ సీలు, గ్యారంటీ
మరియు వాగ్ధానపు అంశాలు, కుడివైపున
ఉన్న అశోక స్థంభం చిహ్నం, నోటుపై
ఉన్న ఆర్‌బిఐ గవర్నర్ గారి సంతకం ఉబ్బెత్తుగా
ఉండి చేతితో తాకితే గుర్తించే విధంగా ఉంటుంది.
7 వాటర్ మార్క్స్: మహాత్మాగాంధీ బొమ్మ, నలువైపులా వివిధ
కోణాలలో గీయబడి ఉన్న గీతలు, బొమ్మ
దిగువన కనిపించే -500 అంకెను
సూచిస్తున్న ఎలక్ట్రోలైటు గుర్తులను లైటుకెదురుగా పెట్టి చూస్తే ఇది మరింత
ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
8 ముద్రించిన నంబర్ల పరిమాణం: నోటు ఎడమవైపు
పైన మరియు కుడివైపు క్రింద చిన్నసైజునుండి పెద్దసైజుకు పరిమాణం పెరిగి ఉంటుంది.
9 కంటికి రెండురకాల రంగులతో కనిపించే సిరా
(ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్): నోటు సమతలంగా పెట్టిచూసినప్పుడు రూపాయి గుర్తు
మరియు 500 నంబరు రంగు
ఆకుపచ్చగా కనిపిస్తుంది. కాని అదే అంకెను వేరోక కోణంలో చూసినప్పుడు నీలంరంగులో
కనిపిస్తుంది.
10 అశోక స్థంభం చిహ్నం కుడివైపున ముద్రించి
ఉంటుంది. పాతనోటులో ఇది ఎడమవైపున ఉంటుంది.
11 కుడివైపు ఉబ్బెత్తుగా కనిపించే ఆధునికంగా
రూపొందించిన ఒక వృత్తములాంటి గుర్తు ఈ గుర్తుద్వారా అది -500 అని చూపులేని వారు లేదా చూపు మందగించినవారు కూడా
గుర్తించడానికి సహాయపడుతుంది.
12 నోటుకు ఎడమవైపు కుడివైపు చివరలో 5 ఏటవాలు లైన్లు ఉబ్బెత్తుగా ప్రింటు
చేయబడి ఉంటాయి.
-500
నోటు వెనుకభాగం, అందులోని
5 గుర్తింపు
చిహ్నాలు:
13 ఎడమవైపు పైన ముద్రించబడిన సంవత్సరము.
14 నోటుకు ఎడమవైపున స్వచ్ఛభారత్ నినాదం
లోగో.
15 ఎడమవైపు మధ్యలో వివిధ భాషల్లో ఐదు వందలు
అని వ్రాసిన బాక్సు ముద్రించబడి ఉంటుంది.
16 భారతీయ వారసత్వ సంపద అయిన ఎర్రకోట చిత్రం
మరియు దాని మీద మువ్వన్నెల జెండా.
17 కుడివైపున దేవనాగరిలిపిలో ముద్రించిన
డినామినేషన్ నంబరు.
క్రొత్త -2000 రూపాయల నోటు -
ముఖ్యమైన గుర్తింపు చిహ్నాలు:
-2000 నోటు ముందుభాగంలో ముఖ్యమైన 13 గుర్తింపు చిహ్నాలను కలిగి ఉంది.
1 సీత్రూ డినామినేషన్
నంబర్: క్రొత్త -2000 నోటును లైటుకు
ఎదురుగా పెట్టి చూసినప్పుడు సీత్రూడినామినేషన్ నంబర్ రెండు వైపులా ముద్రించబడిన
భాగాలు, వ్యత్యాసం లేకుండా
కలిసిపోయి ఒకటిగా కనిపిస్తుంది.
2 కంటికి కనిపించని డినామినేషన్ నంబరు:
నోటును 450 కోణంలో
చూసినప్పుడు ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ నల్లబడి దేవనాగరి లిపిలో వ్రాసిన
డినామినేషన్ కనిపిస్తుంది.
3 దేవనాగరిలిపిలో ముద్రించిన డినామినేషన్
నంబరు -2000
4 ఎడమవైపు తలత్రిప్పి నట్లున్న
మహాత్మాగాంధీ చిత్రం.
5 బొమ్మపక్కనే సూక్ష్మ పరిమాణంలో
ముద్రించిన 'ఆర్‌బిఐ' మరియు -2000.
6 భద్రతా కవచంలా ఉండే మెరుపుదారం
సెక్యూరిటీ త్రెడ్.
7 గ్యారంటీ మరియు వాగ్ధానపు అంశములతో
గవర్నర్ సంతకం మరియు భారతీయ రిజర్వుబ్యాంకు సీలు.
8 మహాత్మాగాంధీ బొమ్మ పక్కనే -2000 అని ముద్రించిన ఎలక్ట్రోలైట్ వాటర్ మార్కు.
9 నోటు ఎడమవైపు పైన మరియు కుడివైపు క్రింద
ముద్రించిన నంబర్ల పరిమాణం చిన్నసైజు నుండి పెద్దసైజుకు పెరిగి ఉంటుంది.
10
దేవనాగరి లిపిలో ఆప్ట్టికల్లీ వేరియబుల్ ఇంకుతో ముద్రించిన -2000.
11 కుడివైపున అశోక స్థంభం చిహ్నం.
12 సమాంతరంగా దీర్ఘచతురస్రాకారంలో
ఉబ్బెత్తుగా ముద్రించిన -2000 ముద్ర.
13 నోటుకు కుడివైపు ఎడమవైపు చివరల్లో 7 ఏటవాలు లైన్లు ఉబ్బెత్తుగా ముద్రించి
ఉంటాయి.
-2000 నోటు వెనుకభాగంలోని 4 గుర్తింపు
చిహ్నాలు:
14 నోటును ముద్రించిన సంవత్సరం.
15 స్వచ్ఛభారత్ అభియాన్ లోగో మరియు దాని
నినాదపు టాగ్‌లైను.
16 వివిధ భారతీయ భాషలలో -2000 అని వ్రాసిన బాక్సు.
17 భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్‌గ్రహ
అంతరిక్ష నౌక యొక్క చిత్రం మంగల్‌యాన్.