యూనిట్
Flash News
ప్రపంచ 'ఐరన్ మ్యాన్' పోటీలలో పాల్గొన్న విశాఖ సిటీ పోలీస్ కానిస్టేబుల్

ది 03.12.2017 వ తేదీన వెస్ట్రన్ ఆస్ట్రేలియా లోని
బస్సెల్‌టన్ ప్రాంతంలో జరిగిన ప్రపంచ ఐరన్ మ్యాన్ పోటీలలో విశాఖపట్నం సిటీ
భీమిలి పి.ఎస్ (ట్రాఫిక్) పి.సి 1444 పరవాడ కృష్ణ పాల్గొని
చక్కని ప్రతిభ కనభరిచారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పాల్గొన్న మొట్ట మొదటి
వ్యక్తిగా చరిత్ర సృష్టించడమేగాక, రాష్ట్ర పోలీస్ ఖ్యాతిని
అంతర్జాతీయ క్రీడా వేదికపై సగర్వంగా చాటారు. ఈ విభాగంలో 3.8
కి.మీ ల స్విమ్మింగ్, 180 కి.మీ ల సైక్లింగ్, 42 కి.మీల రన్నింగ్ ఒకేసారిగా పూర్తి చేయాల్సివుంటుంది. ప్రపంచవ్యాప్తంగా
సుమారు 41 దేశాల నుండి మొత్తం 3200
మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొనడమే ఒక ఘనతకాగా, కృష్ణ తన ఏజ్ గ్రూప్‌లో 101 వ స్థానంలో నిలిచి మన
దేశ కీర్తిని ఘనంగా నిలిపారు. ఈ సందర్బంగా విశాఖ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ టి.
యోగానంద్ తమ కార్యాలయంలో పరవాడ కృష్ణ ను అభినందించి, భవిష్యత్‌లో
మరిన్ని అంతర్జాతీయ కీర్తి శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
డిసిసి ( క్రైమ్స్) షిముషి బాజ్‌పాయ్, ఏడిసిపి( స్పెషల్
బ్రాంచ్) రవి కుమార్, ఏసిపి (ట్రాఫిక్ ) కె. ప్రభాకర్,
ఏసిపి ( సి.ఏ.ఆర్ ) సాల్మన్, సి.ఐ (
ట్రాఫిక్ ) సి. హెచ్ శ్రీనివాసరావు, ఆర్.ఐ ( అడ్మిన్)
టి.వి.ఎస్.ఆర్.కె. కుమార్ మరియు ఇతర సిబ్బంది పాల్గొని అభినందించారు.