యూనిట్
Flash News
మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయి విజయనగరం కలెక్టర్

మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ అన్నారు. విజయనగరం జిల్లా వార్షిక పోలీస్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నిరంతరం విశ్రాంతి లేని ఉద్యోగం చేసే పోలీస్ లకు క్రీడలు ఆటవిడుపుగా ఉండి నూతనోత్తేజాన్ని కలిగించి ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి తో కలిసి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఓ ఎస్ డి జె. రామ్ మోహన రావు, పార్వతిపురం ఏ ఎస్పీ డా. సుమిత్ గరుడ్, బొబ్బిలి ఏ ఎస్పీ గౌతమి శాలి, డిఎస్పీలు ఎల్ శేషాద్రి, సి ఎం. నాయుడు, పి. వీరాంజనేయ రెడ్డి, బి. మోహన రావు, ఎల్. మోహన రావు తదితరులు పాల్గొన్నారు.