యూనిట్

హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచిన పోలీసులు

ముదినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న పి.నాగరాజు డ్యూటీలో భాగంగా నైట్‌బీట్‌ నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు.  నాగరాజు కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా హోంగార్డ్స్‌ ఐజిపి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ నిధి నుంచి 20వేలు, జిల్లా ఎస్‌.పి. శ్రీ విజయకుమార్‌ మరో 20వేలు  మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని నాగరాజు భార్య నాగమల్లేశ్వరికి అందజేశారు. ఈ సందర్భంగా హోంగార్డ్సు బీమా పథకం నుంచి లక్ష రూపాయలు అందుతుందని, ఆ మొత్తాన్ని త్వరితగతిన అందేటట్లు కృషి చేస్తామని అడిషనల్‌ ఎస్‌.పి.  బి.డి.వి.సాగర్‌ తెలిపారు. 

వార్తావాహిని