యూనిట్
Flash News
ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా 34 మంది చిన్నారులను కాపాడిన తిరుపతి పోలీసులు

తిరుపతి అర్బన్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఈ రోజు ఉదయం 5 గంటల నుండి చిన్న పిల్లల సంరక్షణ ప్రారంభమైన దని ఎస్పీ డా” గజరావు భూపాల్ తెలిపారు. అయన మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు రోడ్లపై సంచరిస్తున్న, పబ్లిక్ ప్రదేశాలలో, బస్సు షెల్టర్ కూడళ్ళలో బిక్షాటన చేస్తున్న వారిని, సుమారు 34 మంది పిల్లలను గుర్తించామన్నారు. పిల్లల సంరక్షనకొరకై, పిల్లల యొక్క తల్లితండ్రులను మరియు వారికి సంబంధించిన బంధువులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను అప్పగించడం జరుగుతుంది. మిగిలిన పిల్లలను డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ హోం కి, హోం యొక్క అధికారుల సమక్షంలో పిల్లలను అప్పగించడం జరుగుతుందన్నారు.