యూనిట్

విజయవాడ నగర పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో 'ఆపరేషన్‌ ముస్కాన్‌'

విజయవాడ సిటీ: విజయవాడ నగర పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలో 'ఆపరేషన్‌ ముస్కాన్‌'లో భాగంగా 86 మంది బాలలను గుర్తించారు. వీరిలో ఎక్కువగా బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో గుర్తించినట్లు నగర పోలీసులు తెలిపారు. వీరిలో కొంతమంది బాలల వివరాలు తెలుసుకుని వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. మిగతా వారిని చైల్డ్‌హోమ్‌కు తరలించారు. కార్యక్రమంలో కమిషనరేట్‌ పరిధిలోని జోన్‌ల ఏసీసీలు, ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌.ఐ.లు, చైల్డ్‌వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాలు పంచుకున్నారు. వీరికి నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీ సిహెచ్‌డి తిరుమలరావు అభినందనలు తెలిపారు.

వార్తావాహిని