యూనిట్

కడప జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌

కడప:  జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌ కడప జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ శాఖ చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో 158 మంది వీధి బాలలను సంరక్షించినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి తెలిపారు. పాఠశాలలకు వెళ్ళకుండా బస్‌స్టాండ్‌,  రైల్వేస్టేషన్లు, మాల్స్‌,  థియేటర్లు,హోటళ్లలో పని చేస్తున్న 14 ఏళ్ల లోపు పిల్లలను గుర్తించి వారికి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లలకు పనులకు పంపించడం నేరమన్నారు. వారి ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్‌ ముస్కాన్‌ చేపట్టినట్లు తెలిపారు.

వార్తావాహిని