యూనిట్
Flash News
అంబులెన్సు వద్దకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించిన విజయవాడ నగర పోలీస్ కమీషనర్

ప్రజలకు పోలీస్ సేవలను వినూత్నంగా అందిస్తున్న విజయవాడ నగర పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావును నగర ప్రజలు అభినందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ శాఖ చిత్త శుద్దితో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ సరికొత్త వెన్నెలను అద్దుతూ ప్రజలచే శబాష్ పోలీస్ అనిపించుకుంటున్నది. ఈ రోజు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమమే దీనికి ఉదాహరణ. స్పందన కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి అంబులెన్సు లో వచ్చిన ఫిర్యాదు దారుని వద్దకే స్వయంగా వెళ్లి నగర పోలీస్ కమీషనర్ శ్రీ ద్వారకా తిరుమల రావు గారు ఫిర్యాదు స్వీకరించారు.