యూనిట్
Flash News
కాకి - కడవ
(చిన్న పిల్లలకు చిన్ని నాటిక) (హైస్కూల్లో పిల్లలు, ముఖ్యంగా 5,6 తరగతుల పిల్లలు ఈ నాటిక ఆడుకోవచ్చు) ఈ నాటికలో జంతువులకి, కాకులకీ - ముఖానికి అన్నమాట - ‘మాస్క్’లు అట్టతో చేసి తగిలించుకుంటే చాలు - ఆ ‘మాస్క్’కి తగిన రంగు షర్టు, పేంటూ వేసుకుంటే చాలు. ఈ నాటికలో పాత్రలు: ఆవు, కాకి, మేక, కుక్క, మనిషి, ఇంకో కాకి, దేవుడు. ఒక ఆవు, ఒక కాకి స్టేజిమీద వున్నాయి. ఆవు: ఏమోయ్, ఏంటి ఇలా వచ్చావ్? హాయిగా, ఫ్రీగా నా వీపు మీద ఎక్కి షికారు వెళ్లాలని ఐడియానా? కాకి: లేదు సార్... ఆవు: పోనీ నా వీపుమీద చిన్న పుండు వుంది - దాన్ని పొడిచి తిందావనా తెలివి? కాకి: చిచీ... నేను చాలా మంచి దాన్నండి.. మీతో తిరిగితే కాసిని నీళ్లు దొరుకుతాయనీ... ఆవు: ఏడిసినట్టుంది.. నీళ్లు ఎక్కడున్నాయోనీవే వెదుక్కో... ఫో.. ఎగరగలవుగదా?.. కాకి: నాకు ఈ ఊరు కొత్త సార్... అందుకనీ... ఆవు: ఈ ఊర్లో నీళ్ళు పుట్టవు - మాకే చుక్కనీరు లేదు - ఇంక నీక్కూడానా? మీ ఊరికి పో... ఫో... (లైట్ ఆఫ్ అండ్ ఆన్)... (స్టేజి మీద మేక, కాకి) కాకి: నమస్తే సార్... కుక్క: ఆహా... నాకు గుడ్మార్నింగ్ చెప్పింది నువ్వొక్కడివే నయ్యా... చెప్పు ఏం కావాలి?... ఫుడ్డు సంగతి మాత్రం అడక్కు... కాకి: ఫుడ్డు దేముంది సార్?!.. నాకు నాలుగు మెతుకులు చాలు... వాటర్... నీళ్ళు కావాలి... దాహంగా వుంది. కుక్క: రెక్కలు ఏడిసేయ్గదా- ఎగురుతూ నీళ్ళకోసం వెదుకు కాకి: ఎక్కడా కనబడలేదు సార్ కుక్క: నాకూ ఎక్కడా కనబడలేదు - వెళ్లి మునిసిపల్ వాటర్ డిపార్టుమెంట్ వాళ్లని అడిగి, నాకూ చెప్పు. కాకి: వాళ్ళు మనుషులకే జవాబు చెప్పరు, కాకులతో మాట్టాడతారా? నాలుగు మెతుకులు విసరరు. కుక్క: నేను నిన్ను కరిచేలోగా పారిపో.. ఇమీన్ ఎగిరిపో... (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్) (స్టేజిమీద మనిషి, కాకి) కాకి: నమస్తే సార్ మనిషి: నా దగ్గర పైసాలేదు - ఫో... కాకులు కూడా మాటలు నేర్చి అడుక్కుంటే ఏం చెప్పగలం?! కాకి: అడుక్కోడం నాకు పెద్ద చిరాకు సార్.. నీళ్లు ఎక్కడుంటాయి సార్...? మనిషి: వెర్రివాడా- పోనీ.. వెర్రిదానా... ఇళ్ల బయటి కుండల్లో నీళ్లున్నాయేమో చూడు... కాకి: చూశాను సార్... ఎక్కడో అడుగున కాసిని నీళ్లు కనిపించాయి.. .నాకు అందలేదు. మనిషి: కాకులకు రెక్కలుంటాయి గానీ బుర్రవుండదు - వెళ్లి చిన్నచిన్న రాళ్లు తెచ్చి ఆ కుండలో వేయ్ నీళ్లు పై కొస్తాయి - తాగి... ఫో... కాకి: భలే ఐడియా సార్... మనిషి: అవును.. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది కాకి: థ్యాంక్యూ సార్... మనిషి: అన్నట్టు మా పెరట్లో ఓ చెంచా పోయింది - నువ్వుగాని పట్టుకు పోయావా? కాకి: ఛఛ.. నాకు తెలీదు సార్.. నేనాటైపు కాదు, నా రూటే వేరు. (లైట్స్ ఆఫ్ అండ్ ఆన్) (స్టేజిమీద కాకి నీరసంగా నడుస్తోంది - ఎదురుగా ఇంకో కాకి వచ్చింది) కాకి ×: ఏంటాఫేస్ అలా వుంది- పరీక్షల్లో మార్కులు తక్కువచ్చాయా? కాకి ××: లేదు కాకి ×: క్రికెట్లో ఫస్ట్బాల్కి ఔటా ఏంటీ? కాకి ××: కాదండీ బాబు... జనం నన్ను తరిమి కొట్టారు ఎగరలేక, ఎగరలేక వచ్చా... చచ్చా... కాకి ×: ఏమైంది? దొంగతనం గానీ...? కాకి ××: కొంచెం అలాంటిదే... దాహంగా వుంటే ఒక కుండ కనిపించింది.. నీళ్లు అడుగున వున్నాయి. కాకి ×: కొంపదీసి రాళ్లు తెచ్చి వేసేవా అందులో? కాకి ××: అవును... మీకు ఎలా తెలుసు? కాకి ×: ఈ బోడి ఐడియా మనుషులది.. కుండలో రాళ్లు వేస్తే కుండ పగుల్తుంది - లేదా- నీళ్లు ఇంకిపోతాయ్- అంతేగానీ - నీళ్ళు పైకొస్తాయా?! .. ఐనా ఇన్ని రాళ్లు తెచ్చి వేస్తోంటో రెక్కలు అలసి పోవూ ?! కాకి ××: నా రెక్కలు అలిసిపోయాయ్ - నీళ్లు పైకి రాలేదు - కుండ మాత్రం ఢాం!! కాకి ×: ఈ స్టోరీలో నీకు నీతి అర్థమైందా..? కాకి ××: నీళ్లు లేవు, నీతిలేదూ అని అర్థమైంది. కాకి ×: మనుషులకివుండే తెలివికి, అతి తెలివికీ తేడా గమనించాలి. లేకపోతే నీ స్టోరీ లాగే ఫ్లాప్ సినిమా అవుతుంది మన సంగతి. కాకి ××: ఈ మనుషులు పక్షులకి గింజలతోపాటు చలివేంద్రాల్లాగే బొచ్చల్లో కాసిని నీళ్లు పెడుతుంటే బాగుండు. (స్టేజిమీద రెండో వైపునుంచి శివుడు అంటే దేవుడు నడిచివచ్చి...) దేవుడు: తథాస్తు ! (లైట్స్ ఆఫ్)