యూనిట్

గూడు ( పిల్లలకు నాటిక)

(4,5,6,7,8.9,10వ తరగతి చదివే పిల్లలు స్కూల్‍లో వార్షికోత్సవాల్లో ఆడుకోటానికి వీలయే చిన్న నాటికం. నటులు పల్చటి అట్టతో చేసిన ‘మాస్క్’లు తగిలించుకుని మిగత దుస్తులు మాత్రం నల్లటివి ధరిస్తే చాలు) పాత్రలు: మగ కోకిల, ఆడ కోకిల, మగ కాకి, ఆడ కాకి, అరడజను ఆడ, మగ పిల్లలు మాస్క్ల్లో) కోకిల 1: మన కొక మంచి గూడు కావాలి... విన్నారా! కోకిల 2: గూడా? గాడిదగుడ్డా? ఈ చెట్టు చాలదా. ఇక్కడ బాగానే వున్నాంగా. కోకిల 1: చెట్టు చాలదు... గూడు.. గూడు కావాలి గాడిద గుడ్లకోసం కాదు - మన కోకిల గుడ్ల కోసం... కోకిల 2: వాం? అర్జెంటా? కోకిల 1: ఆ! అన్నట్టు గాడిద గుడ్లు కూడా పెడుతుందా కొంపదీసి? కోకిల 2: ఏమో... వెళ్ళి అడిగి రానా? కోకిల 1: వొద్దు-గూడు సంగతి చూడండి కోకిల 2: గూడు కట్టడం బోర్‍... గూళ్లు అద్దెకి దొరకడం లేదు... ఆ.... ఐడియా! కోకిల 1: చెప్పండి... ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుంది... కోకిల 2: బుర్రలేని కాకులున్నాయి గదా! కోకిల 1: ఉంటే? కోకిల 2: ఈజీ.. కాకుల గూళ్లో.. మన గుడ్లుపెట్టేద్దాం కోకిల 1: హమ్మో... కాకులకి తెలిస్తే? కోకిల 2: లెక్కల్లో అవిపూర్‍... వాటికి గుడ్లు పెట్టడమే వచ్చు... లెక్కపెట్టడం రాదు... •ఱస్త్రష్ట్ర•• శీఅ •అ• శీ•• -(గుండ్రంగా ఓసారి తిరిగి..) కోకిల 1: ఆహా... ఈ కాకి గూట్లో గుడ్లే వున్నాయి. కోకిల 2: కాకులు లేవు - భోజనానికి వెళ్లుంటాయి... కోకిల 1: ఇదే ఛాన్స్... •ఱస్త్రష్ట్ర•• శీఅ •అ• శీ•• -(అందరికీ కనిపించడం కోసం తెల్లటి బంతులు •••స్త్రవ మధ్య పెట్టి ఉంచాలి) కోకిల 2: ఓహ• బోలెడు గుడ్లు పెట్టావే! వెరీ గుడ్‍ కోకిల 1: గుడ్లని ‘గుడ్‍’ అనకూడదు - ‘ఎగ్స్’ అనాలి - తెలీదా?! కోకిల 2: ఓకే ! కోకిల 1: ఓకే కాదు, ఎగ్స్ అనాలి (కోకిల 2 - నెత్తి కొట్టుకుంది) •ఱస్త్రష్ట్ర•• శీఅ •అ• శీ•• (•••స్త్రవ మీద కాకులు) కాకి 1: నిజంగా దేవుడు ఉన్నాడండీ! కాకి 2: ఏం? చూశావా? కాకి 1: చూస్తున్నాగా ! నేనేమో రెండో, మూడో గుడ్లు పెట్టాను - కానీ ఇప్పుడవి బోలెడయ్యాయి. ఇది మహిమ! కాకి 2: నాకు అనుమానంగా ఉంది... కాకి 1: దేవుడి మీదా? కాకి 2: కాదు - నీ మీద... నీకు లెక్కలు రావేమో! ఐనా ఇంతమంది పిల్లలకి తిండి ఎలా సంపాదించడం? కాకి 1: కాకి పిల్లలు కాకికి ముద్దు అని మనుషులు అంటారు - మనకి ముద్దు వుండాలి కదా? కాకి 2: ముద్దు సరే ముద్ద - సంగతి! ....•ఱస్త్రష్ట్ర•• శీ•• •అ• శీఅ ... (•••స్త్రవ మీద కాకి పిల్లలు, కోకిల పిల్లలూ చేతులు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ ఆడుతున్నాయి. ముగ్గురు పిల్లలు పాడుతున్నారు - పాట ఆపినప్పుడు ముగ్గురు పిల్లలు ‘కావ్‍...కావ్‍’ అంటున్నారు- ఇలా రెండు..మూడు నిముషాలు రిలీఫ్‍ కావాలి) 3 కోకిల పిల్లలు: బత్తమీజ్‍ దిల్‍... బత్తమీజు దిల్‍.. మానెనా.. మానెనా... (=వ•శ్రీవ• ••శీజూ) 3 కాకి పిల్లలు: కావ్‍..కావ్‍..కావ్‍.... క్రా..క్రా..క్రా...క్రా.. (•••స్త్రవ •ఱ•వ •ఱఅవ నుంచి రెండు కాకులు - అంటే 1,2 కాకులు వచ్చాయి) కాకి 1: ష్‍.. ఏంటి గోల ! ఆపండి.. మైకులు బద్దలవుతున్నాయి కాకి 2: ఓ.. తలనెప్పి.. ఏంటీ కాకి గోల?! కాకి 1: ఏవండీ మనని మనమే ఇన్‍సల్ట్ చేసుకుంటామా! తప్పు.. కాకి 2: ఓకే.. ఏంటీ కోకిల గోల?! (ఇప్పుడు 1, 2 కోకిలలూ వచ్చాయి) కోకిల 1: ఏంటి కాకిగారూ? మా పిల్లలు చక్కగా పాడుతోంటే - అది గోలనా.. కాకి గోల మీ పిల్లలదే... కోకిల 2: ఓ గాడ్‍.. ఇప్పుడెలా? కాకి 2: మర్యాదగా మాట్టాడండి.. ఐనా మా యింటికి .. ఐ మీన్‍.. మా గూటికి మీ పిల్లలు ఎలా వచ్చాయి?! కాకి 1: మేం లేనప్పుడు దొంగతనంగా వచ్చారా? కాకి 2: క్షమించండి.. సారీ... ఇళ్ల అద్దెలు పెరిగి పోయాయి... అందుకని మా గుడ్లని ఇక్కడ పెట్టాం .. సారీ సర్‍.. కాకి 1: మాకు చెప్పకుండా గుడ్లు తగిలి మా పిల్లలలొచ్చారు... సారీ... కోకిల 2: సర్లెండి..మీ పిల్లల్ని మీరు ఇంక తీసుకుపోండి... కోకిల 1: పోనీలెండి.. సమ్మర్‍ హాలీడేస్‍ కదా - పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటారు. కోకిల 2: ఏడిసినట్టుంది నీ తెలివి! అందరు పిల్లలు కలిసి: మీ గొడవ ఆపండి మేం ఆడుకుంటాం కోకిల 2: ఐడియా బాగానే వుంది.. (కాకులు, కోకిలలూ కలిసి) ‘‘బలమ్‍ పిచికారీ.. జోతునెముఝె మారీ.. కావు కావు కావూ క్రావ్‍ క్రావు క్రావూ’’ (అని పాడుతోంటే కర్టెన్‍ వేసేయ్యాలి)

వార్తావాహిని