యూనిట్
Flash News
తిక్క కుదిరింది

ఇందులో:
సింహం, ఎలుక, ఆవు, దూడ, మనిషి 5 పాత్రలు, ముఖాలకు మాత్రమే పల్చటి అట్టతో కట్ చేసిన
మాస్క్ తగిలించుకుంటే చాలు. ఇక సింహం వేషంవారు బ్రౌన్ పాంట్, షర్ట్, ఎలుక బ్లాక్ పాంట్, షర్ట్ అలాగే ఆవు, దూడలకు వైట్‌డ్రస్‌చాలు. మనిషికి తలపాగా, మీసం చాలు.
(తెలుగు వచ్చిన 6,7,8,9 తరగతుల పిల్లలు బడి వార్షికోత్సవాల్లో సరదాగా
ఆడుకోవచ్చు)
ఇందులో:
సింహం, ఎలుక, ఆవు, దూడ, మనిషి 5 పాత్రలు, ముఖాలకు మాత్రమే పల్చటి అట్టతో కట్ చేసిన
మాస్క్ తగిలించుకుంటే చాలు. ఇక సింహం వేషంవారు బ్రౌన్ పాంట్, షర్ట్, ఎలుక బ్లాక్ పాంట్, షర్ట్ అలాగే ఆవు, దూడలకు వైట్‌డ్రస్‌చాలు. మనిషికి తలపాగా, మీసం చాలు.
(సింహం నిలబడి వుంది- నిండావల
వేసివుంది)
సింహం:
నామీదే వల వేస్తారా! వేసిన వాడి
పని
అయిపోయింది, ఖతం!
ఈ వల వేసిన
వాడు
గాడిద.
(తెరలోపలనుంచి ఒక వాయిస్):
నోరు
జాగ్రత్త!
నన్ను
మనుషులతో పోలుస్తావా! చీరేస్తా...
(స్టేజిమీద, సింహం దగ్గరగా ఎలుక వచ్చింది)
సింహం:
ఒరే - ఇలా రారా!
ఎలుక:
నన్ను! రా- అంటావా! ఒళ్లు ఎలా
వుందేం?
సింహం:
నేనెవర్నో తెల్సా?
ఎలుక:
వలలో పడ్డాకా ఎవడేనా ఒకటే - ఐ డోంటేకేర్! ఐనా అడవుల్లో ఏడవక సిటీకి ఎందుకొచ్చా?
సింహం:
ఆడవా, నా
మొహనా?!- చెట్లు, అడవులూ నరికేస్తోంటే సిటీకి రావాల్సిందేనా?!
ఎలుక:
ఐతే?
సింహం:
నోర్మూసుకుని వల కొరికెయ్
ఎలుక:
సారీ, డెంటిస్టుతో
పనివుంది-వస్తా
సింహం:
పోనీ ఓ సాయం చెయ్-నామీద వలవేసిన వాడి పీక కొరికెయ్...ప్లీజ్.
ఎలుక:
చూద్దాంలే-వస్తా.
(ఎలుక వెళ్లిపోయింది)
(ఆవు పాడుతూ వస్తోంది)....లుంగిడాన్స్..లుంగిడాన్స్
సింహం:
రేయ్...ఆగరా!
(ఆవు ఆగిపోయింది)...ఆవు: బాబోయ్!..
సింహం:
నాపేరు బాబోయ్ కాదు,
సింహం-
ఈ వల తీసేయ్
ఆవు:
వల తీస్తే మింగేస్తారా సార్?
సింహం:
ముందు వల తీయ్‌రా...
(తల ఆడించి వల తీసేసి పక్కన పడేసింది) ఆవు: మంచి
మర్యాదా లేదు - ఊళ్లో ఎలా బతుకుతావు)
సింహం:
నీ మొహం... ఆకలిగా వుంది... నిన్ను తింటా
(సింహం రెండు చేతులు ఆవు భుజం మీద వేసింది)
అన్యాయం
సార్ - సాయం చేసిన వాడిని బోం చేస్తారా?
సింహం:
మంచి చేసిన వాడిని మోసం చేయడం నా హాబీ!
ఆవు:
ఆగండి సార్... మా అబ్బాయికి కాస్త గడ్డి పెట్టివస్తా....
సింహం:
నీ బోడి తెలివి నాకు తెల్సు.. ఈ స్టోరీ సినిమావాళ్లకి కూడా తెల్సు...
ఆవు:
నమ్మండి సార్...కుర్రాడు ఇంటి దగ్గర ఏడుస్తున్నాడు...పాలో, గడ్డో ఇచ్చి వచ్చేస్తా...
సింహం:
ఇంటికి వెళ్లక్కర్లా...గట్టిగా అరువు భయపడి మీ అబ్బాయి ఇక్కడికే వస్తాడు.
ఆవు:
ఓకే... అయ్మోయ్...బాబోయ్... అంబా...అంబా...
(మనిషి, ఎలుక, దూడ వచ్చారు)
ఒకేసారి
మనిషి, ఎలుక, దూడ: బాబోయ్..
సింహం:
ఒరేయ్ ఎవర్రానువ్వు?
(మనిషి అటూ ఇటూ చూసి...)
మనిషి:
నేను అమెరికాకి ప్రెసిడెంట్‌గా పని
చేస్తున్నానండి...
సింహం:
మంచిది...వెళ్లి గడ్డిపట్రా)
ఆవు:
నేనూ, మా
అబ్బాయీ తెస్తాం లెండి
సింహం:
ఏడిసేవ్...మనిషి వెళ్లి తెస్తాడు.
ఎలుక:
ఆయనెందుకు?
సింహం:
మనిషఙ తింటే పరువు
పోతుంది...మీ
ముగ్గుర్నే తింటా
(ఎలుక మనిషి చెవిలో రహస్యం చెప్పింది)
సింహం:
ఏంట్రా అదీ? ట్రిక్కులా?
ఎలుక:
అవును సార్... ఆయన ట్రిక్కు చేసి
గడ్డి
తెప్పిస్తాడు.
దూడ:
ఆయన హాబీ అది.
మనిషి:
సింహంసార్- మీరు ఐదు అంకెలు చెప్పేవరకు కళ్లు మూసుకోండి...గడ్డితెప్పిస్తా..
సింహం:
గడ్డి తెప్పించకపోతే మనసు మార్చుకుంటా- మీ అందర్ని భోంచేస్తా
దూడ:
ఐతే ఓకే...
ఆవు:
రెడీ-వన్,టూ,త్రీ...కళ్లు మూయండి
(సింహం రెండు చేతుల్తో కళ్లు మూసుకుంది)
(వెంటనే ఎలుక, మనిషి కలిసి పక్కనే వున్న వల తీసి సింహం మీద
విసిరేసి, చేతులు
దులుపుకున్నారు) (సింహం గింజుకుంది)
దూడ:
తిక్కకుదిరింది!
ఎలుక:
జూ వాళ్లని పిలుద్దాం... వీణ్ణి తీస్కెళ్లి
జూలో
పడేస్తారు.
ఆవు:
మనిషికి తిక్కుంది-కాని దానికి
లెక్కలేదు-
సింహం:
గాండ్రు...గాండ్రు...యే అన్యాయ్
హై...గాండ్రు
ఎలుక:
వెళ్లొస్తాం గురూ....
(ఎలుక, మనిషి, ఆవుదూడ పాడుతూ వెళ్లి
పోయారు)
జూ...సారొస్తారొస్తారొస్తారొస్తారూ''