యూనిట్

నొప్పిడాక్టరు

''దయచేసి డాక్టరుగారిని గబగబా రమ్మనరూ, కోతులకి మరీ అధ్వాన్నం అయిపోయింది. అని డాక్టరుగారి కోసం ఆదుర్దాగా చూస్తున్నాయి'' అంది. 

''యేం దిగులు పడద్దు. మేం చాలా వేగంగా నడుపుతున్నాం. కోతులు యెక్కువ కాలం నిరీక్షించక్కర్లేదు'' అంది మొసలి.

ఆ మాట విన్నాక కొంగ కొంచెం కుదట పడింది. నొప్పిడాక్టరుగారు మరీ దూరంలో లేరని చెప్పడానికి కోతుల దగ్గరికి యెగిరివెళ్లిపోయింది.

ఓడ వేగంగా నడుస్తోంది. మొసలి పైన వుంది. వున్నట్టుండి డాల్ఫిన్‌లు ఓడ దగ్గరికి యీదుకుంటూ రావడం చూసింది.

''బాబ్బాబు, ప్రఖ్యాత నొప్పిడాక్టరుగారు ఓడలో వున్నారేమో చెప్తారా'' అని అడిగాయి.

''వూం, వున్నారు. ప్రఖ్యాత నొప్పిడాక్టరుగారు ఓడలో వున్నారు'' అని మొసలి బదులు చెప్పింది.

''కోతులకి యింకా యింకా అధ్వాన్నం అయిపోతోంది. డాక్టరుగారిని యింకా వేగంగా రమ్మని చెప్పరా?''

''యేం దిగులు పడకండి. మేం మంచి స్పీడుగా వస్తున్నాం. కోతులు యెక్కువసేపు నిరీక్షించక్కర్లేదు'' అంది మొసలి.

ఉదయం డాక్టరుగారు మొసలితో అన్నాడు:

''ఓడ ముందు యేమిటది? అది పెద్ద భూభాగం అనుకుంటాను. యిది ఆఫ్రికా యేమో.''

''అవును, యిదే ఆఫ్రికా'' అని అరిచింది మొసలి. ''ఆఫ్రికా! ఆఫ్రికా! కొంచెం సేపట్లో ఆఫ్రికాలో అడుగుపెడుతున్నాం! అదుగో ఉష్ణపక్షి కనిపిస్తోంది. ఖడ్గమృగం అదుగో. ఒంటెలు, ఏనుగులు!''

ఆఫ్రికా! ఆఫ్రికా!

నా ప్రియమైన ఖండమా!

ఆఫ్రికా! ఆఫ్రికా!

నా మాతృభూమీ!

తుఫాను

కాని ఆ సమయంలో తుఫాన్‌ విరుచుకుపడింది. వాన! గాలి! మెరుపులు!ఉరు ములు! అలలు ఉవ్వెత్తున లేచాయి, వాటిని చూస్తే నే యేవళ్లేనా భీతాంగం యెత్తిపోయేవాళ్లు.

వున్నట్టుంది యేదో రావణాగోల - ట్రాక్‌-టర్రా-ర్రాక్‌-ఓడ ఒరిగింది. 

''ఏమైంది? ఏమైంది?'' అని డాక్టరుగారు అడిగాడు.

''ఓడ బద్దలైపోతుంది'' అని చిలక అరిచింది. ''మన ఓడ బండరాతికి ఢీ కొట్టింది, ఫెళఫెళా విరిగిపోతోంది. మనం ములిగి పోతున్నాం. ఎవళ్లకి వాళ్లు బయటపడండి.''

''కాని నాకు యీత రాదే!'' అంది చిచీ.

''నాకూ రాదు'' అంది గుర్రుగుర్రు.

అని రెండు భోరున యేడ్చాయి. అదృష్టవశాత్తూ మొసలి వాటిని తన వెడల్పాటి వీపుమీద యెక్కించుకుని ఒడ్డుకు సరాసరి యీదుకుంటూ పోయింది. 

అమ్మయ్య బతికాం! అంతా సురక్షితంగా వుండడం, అంతా ఆఫ్రికా చేరుకోవడం జరిగింది. కాని ఓడ మాత్రం పోయింది. ఓ పెద్ద అల లేచి దాన్ని ముక్కలు ముక్కలు చేసేసింది.

మరి యింటికి తిరిగివెళ్లడం యెలాగ? యిక వేరే ఓడ లేదు. నావికుడు రాబిన్‌సన్‌కి యేం చెప్పాలి?

చీకటి పడుతోంది. డాక్టరుగారు బాగా అలిసిపోయారు. ఆయన జంతువులూనూ, నిద్ర ముంచుకొచ్చేస్తోంది. అవి మొత్తం తడిసిపోయాయి. 

అయినా డాక్టరుగారు పడుకోవాలని అనుకోలేదు.

''పదండి, పదండి! మనం వేగిరపడాలి! కోతుల్ని కాపాడాలి! పాపం వాటన్నటికీ జబ్బుగా వుంది. వాటిని బాగు చేస్తానని నా కోసం ఆతృతగా చూస్తున్నాయి!''

డాక్టరుగారు చిక్కుల్లో పడడం

గుడ్లగూబ బుంబా డాక్టరుగారి దగ్గరికి ఎగిరివచ్చి బెదురు గొంతుకతో అంది:

''హుష్‌, వుండండి, ఎవరో వస్తున్నారు. ఎవళ్లవో అడుగుల చప్పుడు వినిపిస్తోంది.''

మొత్తం అన్నీ ఆగిపోయి, విన్నాయి.

చింపిరి జుట్టు ఆగిపోయి, విన్నాయి.

చింపిరి జుట్టు రేగిపోయి, పొడుగాటి నెరిసిన గడ్డం వున్న ముసలాయన ఒకడు అడివిలోంచి యివతలికి వచ్చి, అరిచాడు:

''యిక్కడేం చేస్తున్నారు? ఎవరు మీరు? యిక్కడికెందు కొచ్చారు?''

''నన్ను నొప్పిడాక్టరు అంటారు. జబ్బుగా వున్న కోతుల్ని బాగుచెయ్యడం కోసం ఆఫ్రికా వచ్చాను''అని చెప్పాడు డాక్టరుగారు.

''హా,హ్హ, హ్హ!'' అంటూ నవ్వాడు చింపిరి జుట్టు మనిషి. '' 'జబ్బుగా వున్న కోతుల్ని బాగుచెయ్యడం కోసం!' యింతకీ మీరు యిప్పుడెక్కడున్నారో తెలుసా?''

''వుహూం, ఎక్కడున్నాం?'' అని అడిగాడు డాక్టరుగారు.

''గజదొంగ బార్మలేయ్‌ దగ్గరికి వచ్చారు మీరు!''

''బార్మలేయ్‌ దగ్గరికా!'' అని అరిచాడు డాక్టరుగారు. ''అయ్యో, యేం గతి పట్టింది! భూమ్మీద బార్మలేయ్‌ అంత దుష్టుడు లేదు. కాని గజదొంగకి లొంగం, చావనేనా చస్తాం గాని! మనం రోగిష్టి కోతుల దగ్గరికి పరిగెత్తి పోదం పదండి!

వార్తావాహిని