యూనిట్

పోలీస్ కుటుంబానికి ఆర్థిక సాయం

3వ పటాలములో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న శివ(హెచ్‌సి 312) ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను భద్రత నుండి రూ.3,97,480ల విడుదలైంది. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి చేతులమీదుగా ఎల్‌.శివ సతీమణి శ్రీమతి ఎల్‌.వెంకటలక్ష్మికి అందజేశారు.

పోలీసుశాఖకు ఎనలేని సేవలు చేసిన ఎల్‌.శివ కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏవో టి.ఎస్‌.వి.ఎస్‌. రాంప్రసాద్‌ఆర్‌.ఎస్‌.ఐ. ఎన్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని