యూనిట్
Flash News
బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేసిన నెల్లూరు పోలీసులు

నెల్లూరు నగరంలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న నేరస్తులను చిన్న బజార్ పోలీస్ సి.ఐ. మధు బాబు, సంతపేట పోలీస్ స్టేషన్ సి.ఐ. రాములు నాయక్ రెండు బృందాలుగా ఏర్పడి అర్చన మరియు S2 సినిమా హాల్ వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్న నేరస్తులను పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నర్తకి, S2 మరియు అర్చన, లీలామహాల్ లలో కొత్తగా రిలీజ్ అయిన “సరిలేరు నీకెవ్వరు” మరియు “అలా వైకుంఠపురం” సినిమా టిక్కెట్లు-116, సెల్ ఫోన్-2 మరియు నగదు Rs.16,000/- స్వాధీనం పరుచుకున్నారు.