యూనిట్

'మనం-నేను' నినాదంతో కేన్సర్‌పై పోరాటం

''మనం-నేను' అనే నినాదంతో 'ప్రపంచ కేన్సర్‌ దినం 2016-2018'లలో కేన్సర్‌పై పోరాటం, అన్వేషణ ప్రారంభిద్దాం. ప్రతి ఒక్కరూ దీన్ని చైతన్యంగా తీసుకుని, ఒక్కక్కరుగా తమ వ్యసనాలకు స్వస్తి చెప్పి మిగతా వారికి ఆదర్శంగా నిలుద్దాం.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న 'కేన్సర్‌' మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షిద్దాం...

అందరికీ కేన్సర్‌ ప్రభావం వివిధ రకాలుగా వ్యాపిస్తోంది. దీనికి అందరూ చేయాల్సింది చైతన్యం కలిగించి వ్యాధిని నివారించడమే.. ఈ ప్రభావం దేనినుంచి వస్తుందో కనిపెట్టి కుటుంబాన్ని, వ్యవస్థను కాపాడాలి. ప్రపంచ కేన్సర్‌ దినం రోజు అందరికీ తెలిసేలా నివారణకు ఏమి చేయాలి, ఏమి చేస్తే 'కేన్సర్‌' తగ్గుతుందో ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రతిజ్ఞ చేయాలి. నివారణ మార్గాన్ని ఎంచుకొని 'మనం-నేను' నినాదంతో కేన్సర్‌పై పోరాటం ప్రారంభించండి.

ప్రపంచ కేన్సర్‌ దినం ఫిబ్రవరి 4న చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేసి కేన్సర్‌ నివారణకు మార్గాలు, కేన్సర్‌ గుర్తింపు కారకాలు, వ్యాధి చికిత్సకు పద్ధతులు తెలపాలి. దీంతో చివరగా ప్రపంచంలో కేన్సర్‌ నివారణకు 2020 టార్గెట్‌గా ఎంచుకుందాం. కేన్సర్‌ మరణాలను గణనీయంగా తగ్గించి ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని ముందు తరాలకు అందిద్దాం. 

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) (ఐఎఆర్‌ఎస్‌) అంతర్జాతీయ కేన్సర్‌ కంట్రోల్‌ (యుఐసిసి) కేన్సర్‌ సులభంగా ఎలా వస్తుందో.. ఎలా నివారించవచ్చో తెలుపుతూనే ఉంది.

కేన్సర్‌ వస్తే ఆపడం అంత సులువు కాదు... నివారణ ఒక్కటే మార్గం.. కేన్సర్‌ మనిషి కణజాలాల్లో వేగంగా వ్యాపిస్తుంది. చిన్నగా మొదలైన కేన్సర్‌ శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. చిన్నచిన్న జాగ్రత్తలతో దీన్ని నివారించుకోవాలి. పొగాకు నమలడం, పొగత్రాగడం మొదలైనవి తగ్గించాలి. కేన్సర్‌ తగ్గించేందుకు సర్జరీ, రేడియోథెరపీ, కీమో థెరపీ ద్వారా ప్రత్యేకంగా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా కేన్సర్‌కి కారణాలు పొగత్రాగడం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్య జీవనశైలి కారణం. కావున.. కేన్సర్‌ వచ్చే కారకాలను ముందే తెలుసుకొని దురలవాట్లకు దూరంగా ఉండి ఆనందమయ జీవనశైలిని ఎంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

కేన్సర్‌ రాకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:

1.              సాధ్యమైనంతవరకు బరువు తగ్గించుకోవాలి: అధిక బరువు వల్ల ఒబేసిటీ (స్థూలకాయం) కేన్సర్‌కి కారణం కావచ్చు, ఇంకా మరికొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

2.             ప్రతి రోజు శారీరకంగా దృఢంగా ఉండేలా చూసుకోండి, దీనికి కనీసం 30 నిమిషాల వ్యాయామం తప్పనిసరి: శరీరం శారీరకంగా బలంగా ఉంటే పెద్దపేగుల్లో వచ్చే కేన్సర్‌ దుష్పరిణామాలు, తక్కువగా ఉంటాయి. మహిళలకు గర్భాశయ, రుతుక్రమ సమస్యలు, తద్వారా రొమ్ము కేన్సర్‌ వంటి దుష్పరిణామాల నుండి బయట పడవచ్చు. 

3.             తియ్యని పదార్థాలు, పానీయాలు ఆల్కహాల్‌, ఎనర్జీ డ్రింక్‌లు వంటివి తగ్గించాలి: అధిక క్రొవ్వు కలిగిన పదార్థాలు, ఎక్కువ చక్కెర, తక్కువ పీచు పదార్థం కలిగిన ఫాస్ట్‌ఫుడ్‌ లాంటివి తగ్గించాలి. వీటితో కేన్సర్‌ పెరిగే ప్రమాదం ఉంది.

4.             వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ధాన్యపు గింజలు బీన్స్‌ మొదలైనవి తీసుకోవాలి: ఆకుపచ్చని రంగుగల పండ్లు, కూరగాయలు, బొప్పాయి, క్యారెట్‌, టోమేటో, ఆకుకూరలు వంటి వాటిలో ఉండే ఆంటిఆక్సైడ్‌లు కేన్సర్‌ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. పొట్టుతీసిన ధాన్యపు గింజలు, కాబులి చనగలు, రాజ్‌మా వీటిలో మినరల్స్‌, విటమిన్స్‌, ప్రొటీన్లు శరీర పటిష్టతను పెంచి వ్యాధి కారకాలను దరిచేరనివ్వవు.

5.             రెడ్‌మీట్‌ను (బీఫ్‌, పంది, మేక మాంసం) తగ్గించాలి. ఎండు మాంసం, ఎండు చేపలు వంటివి తీసుకోకూడదు.

6.             రోజూ ఆల్కహాల్‌ తీసుకోవడం తగ్గించాలి.

7.             ఆహారంలో తగినంతగా ఉప్పు ఉండేలా చూసుకోవాలి.

8.             ఆహార నియమాలు పాటించాలి.

9.             మాతృమూర్తులకు వచ్చే బ్రెస్ట్‌ కేన్సర్‌ను తగ్గించేందుకు ప్రసవం తరువాత పుట్టిన బిడ్డకు 6 నెలలు తప్పకుండా తల్లిపాలు పట్టడం వల్ల బ్రెస్ట్‌ కేన్సర్‌ను తగ్గించడమేకాకుండా తల్లులు అధిక బరువు తగ్గడమేకాక బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు.

10.            చేపలు, బాదం, వాల్‌నట్‌ తీసుకోవాలి.

11.             చివరగా పొగ నమలడం, పొగత్రాగడం వదిలేయండి.

అందరం ఆరోగ్య పరమైన జీవనం వైపు పయనిద్దాం.  దీనికై 'మనం -నేను'తో చేతులు కలుపుదాం.

వార్తావాహిని